NLG: వేములపల్లి మండల పరిధిలోని కిరాణా షాప్ యజమానులు ప్రమాదకరమైన చైనా మాంజాలను అమ్మవద్దని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ సందర్భంగా చైనా మాంజాలను అమ్మకూడదన్నారు. వీటి వలన ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.