WGL: రాయపర్తి మండలం బంధనపల్లి గ్రామంలో ఏర్పాటు చేయబడ్డ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి కొంతమంది గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడం ద్వారా కొంత భాగం కాలిపోయింది. ఈ సంఘటనపై స్థానిక మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్ బీఆర్ఎస్ శ్రేణులతో కలసి బుధవారం విగ్రహాన్ని పరిశీలించి, దుండగులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.