NZB: నిజామాబాద్ నగర శివారులోని మల్లారం డెంటల్ కాలేజీ సమీపంలో ఉన్న మొరం గుట్టలో గత కొద్ది రోజులుగా కొందరు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. భారీ వాహనాలతో మొరాన్ని తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంటనే అధికారులు స్పందించి అక్రమ మైనింగ్‌ను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.