NLG: మిర్యాలగూడ మండలం రుద్రారంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి రుద్రప్ప చెరువులో చేప పిల్లలను విడిచిపెట్టారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ఈ పంపిణీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.