MNCL: బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ అన్నారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులకు చెందిన యువకులు బుధవారం ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. గ్రామాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు.