ATP: తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో జనవరి 16న ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా జేసీ కుటుంబం ఆధ్వర్యంలో ఈ పోటీలు జరగనున్నాయి. కనుమ పండుగ నాడు ప్రతిభ చూపిన మహిళలకు ప్రత్యేక బహుమతులు అందజేస్తామని ఆలయ ఛైర్మన్ చంద్రమోహన్ తెలిపారు. పట్టణంలోని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.