KMM: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు గురువారం సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ ఉన్నతాధికారులు తెలిపారు. క్రయవిక్రయాలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరిగి శుక్రవారం నుంచి మార్కెట్లో కార్యకలాపాలు యథావిధిగా జరుగుతాయని వివరించారు. ఈ విషయాన్ని రైతులు, వ్యాపారులు గమనించాలని కమిటీ సభ్యులు తెలిపారు.