NGKL: సూర్యలత కాటన్ మిల్ కార్మికులు ఐదు రోజులుగా సమ్మె కొనసాగిస్తుండగా.. రాష్ట్ర కార్మిక సంఘం అధ్యక్షుడు చెరుకు మణికంఠ మద్దతు ప్రకటించారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న వారి టెంట్లను యాజమాన్యం తొలగించడంపై ఆయన మండిపడ్డారు. వేతనాలు, ఇతర డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, భయభ్రాంతి కలిగిస్తే పెద్ద ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.