E.G: దేవరపల్లి మండలం ధూమంతునిగూడెం గ్రామంలో ఉన్న పాత సచివాలయం, MPUP పాఠశాల వద్ద పెరిగిన పిచ్చి మొక్కలతో సిబ్బందికి, విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తాయి. ఇవి దోమలు, పాములకు నిలయంగా మారి, ఆరోగ్య సమస్యలకు, భయాందోళనలకు కారణమవుతాయి. సమస్యను స్థానిక నాయకులు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.