TG: బనకచర్లను అడ్డుకునేందుకు కేంద్రానికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ గుర్తు చేశారు. ‘తెలంగాణ నీటి హక్కులను KCR APకి తాకట్టు పెట్టారు. జగన్తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది మీరు కాదా?. రోజా ఇంటికి పోయి బేసిన్లు లేవని.. భేషజాలు లేవని KCR మాట్లాడరు. గోదావరి, కృష్ణా నీళ్లు ఆంధ్ర వాడుకుంటే తప్పేంటని KCR మాట్లాడలేదా?’ అని గుర్తు చేశారు.