SRD: కొత్త సంవత్సరం పురస్కరించుకుని అపరిచిత వ్యక్తుల నుంచి సెల్ ఫోన్లకు వచ్చే లింక్‌లను ఓపెన్ చేయొద్దని ఎస్పీ పరితోష్ పంకజ్ బుధవారం తెలిపారు. వాట్సప్ గ్రూపుల్లో వచ్చి న్యూ ఇయర్ లింకులపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కలర్ ఫూల్ గ్రీటింగ్స్ అంటూ మార్వెల్ లింక్స్ పంపిస్తారని చెప్పారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.