KRNL: కల్లూరు మండలం ఏ.గోకులపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించి, వారిని పలు ప్రశ్నలు అడిగారు. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలంటే విద్యార్థులు పక్కా ప్రణాళికతో చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ డా.వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.