TG: యూట్యూబర్ అన్వేష్ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అన్వేష్‌ను వెంటనే భారతదేశానికి రప్పించాలని, అతడిని దేశద్రోహిగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించిన అన్వేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.