KNR: గ్రామాల్లో ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను పరిష్కరించడంతోపాటు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని సీపీఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని సీపీఐ కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్లో సీపీఐ తరఫున నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం చేశారు.