AP: ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశామని మంత్రి డీఎస్బీవీ స్వామి అన్నారు. కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తోందని చెప్పారు. జగన్ మాదిరిగా ప్రజలను మోసం చేయబోమని, ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం రాజోలుపాడులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు.