TG: రాష్ట్రంలో అవినీతిపై ఏసీబీ( యాంటీ కరప్షన్ బ్యూరో) వార్షిక నివేదికను విడుదల చేసింది. మొత్తం 199 ఏసీబీ కేసుల నమోదు అయ్యాయని తెలిపింది. ఈ ఏడాది 176 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్ అయ్యారని వెల్లడించింది. 15 మంది అధికారులపై అక్రమాస్తుల కేసు నమోదు కాగా రూ.100 కోట్ల విలువైన ఆస్తులు, రూ.57 లక్షలు సీజ్ చేసినట్లు ప్రకటించింది.