KDP: సిద్దవటంలో బుధవారం ఓ పశువుల షెడ్డును ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదిశేష రెడ్డి ప్రారంభించారు. వీధి పశువులకు సురక్షితమైన ఆశ్రయం కల్పించడమే ఈ షెడ్ ఏర్పాటు ప్రధాన లక్ష్యమన్నారు. దీని వల్ల గ్రామంలో పరిశుభ్రత మెరుగుపడటంతో పాటు రోడ్లపై పశువుల సంచారం తగ్గి ప్రమాదాలు నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో డీవీవో జుబేదా, ఏపీడీ ఆజాద్ ఉన్నారు.