MLG: మంగపేట(M)రాజుపేట గ్రామ సమీపంలోని కప్పగల్లు బ్రిడ్జి వద్ద ప్రధాన రహదారి మూల మలుపు ఇటీవలి వర్షాలకు కోతకు గురై తీవ్రంగా దెబ్బతింది. రోడ్డు భాగం పూర్తిగా ధ్వంసమై ప్రమాదకరంగా మారింది. నిత్యం అధిక రద్దీ ఉండే ఈ మార్గంలో వేగంగా వెళ్లే వాహనాలకు పెను ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించాలని కోరారు.