TG: వరంగల్ బందనపల్లిలో శివాజీ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. స్థానిక ఎన్నికల ముందు శివాజీ విగ్రహాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏర్పాటు చేశారు. అయితే విగ్రహావిష్కరణకు ముందే దుండగులు నిప్పు పెట్టడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ కక్షతోనే విగ్రహాన్ని తగలబెట్టారని గ్రామస్థులు ఆరోపణలు చేస్తున్నారు.