BHPL: చిట్యాల మండలంలోని HP గ్యాస్ గోదాంలో బ్లాక్ మార్కెట్ జరుగుతోందని CPI ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.875 ధర ఉన్న గ్యాస్ సిలిండర్ను రూ.1000 నుంచి రూ.1100కు అక్రమంగా విక్రయిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే గ్యాస్ డీలర్షిప్ టెండర్ నిర్వహించాలని అధికారులను కోరారు.