GDWL: నూతన సంవత్సర వేడుకలు జిల్లా వ్యాప్తంగా బుధవారం సాయంత్రం నుంచి ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టనున్నట్లు ఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రజలందరూ సురక్షితంగా, ఆనందంగా వేడుకలు జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు.