AP: విశాఖలోని ఎంవీపీ సెక్టార్ 11లో డ్రగ్స్ పట్టుబడింది. 4.5 గ్రాముల MDMA, 5.5 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులు వినయ్, సాయి, శ్యామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వినయ్ బెంగళూరు నుంచి విశాఖకు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.