విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జైపూర్ వేదికగా గోవాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై మొదట బ్యాటింగ్ ప్రారంభించింది. 40 ఓవర్లు ముగిసేసరికి ముంబై 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో (157) ఆకట్టుకున్నాడు. కేవలం 56 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో సెంచరీ చేశాడు.