NZB; ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పంచరెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా వాగ్మారే సుభాష్, కోశాధికారిగా రాజ్ కుమార్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా బైస సంగీత, సతీష్ గౌడ్, గోవింద్ రాజ్ గెలుపొందగా, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా రాజు ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా రవి నాయక్, సురేష్, ఆంజనేయులు విజయం సాధించారు. 259 మంది సభ్యులున్న ప్రెస్ క్లబ్లో వివిధ పదవులకు భారీ పోటీ నెలకొంది.