KRNL: కల్లూరు మండలం ఏ.గోకులపాడులో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి బుధవారం ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్లను లబ్ధిదారుల ఇంటి వద్దే అందజేశారు. నూతన సంవత్సర కానుకగా ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ముందస్తుగా నగదు అందడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు