AP: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో మంత్రి అచ్చెన్నాయుడు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో రూ.50 వేల కోట్లకుపైగా పింఛన్ల పంపిణీకే ఖర్చు పెట్టామని పేర్కొన్నారు. పేదలకు పింఛన్ల పింపిణీ అత్యంత సంతృప్తినిచ్చే కార్యక్రమం అని కొనియాడారు.