MNCL: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దండేపల్లి మండలంలోని గూడెం ఎత్తిపోతల పథకం కింద రాబోయే యాసంగిలో పంటలకు సాగునీరు అందే పరిస్థితి లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ అన్నారు. బుధవారం ఎత్తిపోతల పథకాన్ని ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్యానెల్ బోర్డు, వైరింగ్ పనులు చేయనందున సాగునీటి విడుదలలో ఆలస్యం జరిగి రైతులు నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు.