HNK: ధర్మసాగర్ గ్రామంలో నేడు పశువులకు నట్టల నివారణ మందు పంపిణీ చేపట్టారు. గ్రామ సర్పంచ్ మాచర్ల జ్యోతి మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ.. పాడి రైతులు తప్పనిసరిగా తమ పశువులకు నట్టల నివారణ మందును తాగిపించాలని సర్పంచ్ సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొమురమ్మ, మల్లికార్జున యాదవ సంఘం అధ్యక్షుడు గంటే సాంబరాజు యాదవ్ ఉన్నారు.