కోనసీమ: ద్రాక్షారామం శివలింగం ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్చకుడితో ఉన్న వ్యక్తిగత వివాదమే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆరు బృందాలతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించడంతో పోలీసులు అత్యంత వేగంగా పురోగతి సాధించారు.