BPT: బాపట్ల పట్టణం ఇస్లాంపేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జనవరి 1కు బదులు డిసెంబర్ 31న ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.