ASR: డుంబ్రిగూడ మండలంలోని కోసంగి పనసపుట్టు గ్రామంలో బుధవారం ఉదయం పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సచివాలయం సిబ్బంది టీఎన్టీయూసీ అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎం.స్వామితో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదును అందజేశారు. నూతన సంవత్సరానికి ముందే పెన్షన్ మొత్తాన్ని అందించడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.