WGL: రోడ్డు ప్రమాదాలను అరికట్టి ప్రజల్లో భద్రతా అవగాహన పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2026 జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తోంది. జిల్లాలో రవాణా, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో ప్రతిరోజూ హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించడం, డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.