GNTR: నూతన సంవత్సర వేడుకల పేరుతో రోడ్లపై అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బుధవారం గుంటూరు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో కేక్ కటింగ్ చేయడం, మద్యం తాగి వాహనాలు నడపడం వంటి పనులు చేస్తే కేసులు తప్పవని ఆయన స్పష్టం చేశారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా, వేడుకలను జరుపుకోవాలన్నారు.