NZB: బోధన్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నవీపేట్ మండలం కోస్లీ వద్ద గల అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం నుంచి బుధవారం ఉదయం యాసంగి పంటలకు సాగునీటిని విడుదల చేశారు. ఉదయం 10:30 గంటలకు ఇంజినీరింగ్ అధికారులు మోటార్లను ఆన్ చేసి నీటిని వదిలారు. సుమారు 53,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుందని వారు పేర్కొన్నారు.