EG: మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేస్తూ ప్రభుత్వం బుధవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రత్యేక కార్యదర్శి సాయిప్రసాద్ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. అధికారిక కార్యకలాపాలన్నీ రాజమహేంద్రవరం కేంద్రంగానే సాగనున్నాయి. తూ.గో. జిల్లా విస్తీర్ణం పెరిగి పెద్ద జిల్లాగా అవతరించనుంది. నేడు జరగనున్న అఖిలపక్ష సమావేశంలో విలీన ప్రక్రియ జరగనుంది.