MDK: రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో నీటి సమస్య పరిష్కారానికి గ్రామ సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి చర్యలు చేపట్టారు. స్థానిక రామాలయం సమీపంలో నీటి సమస్య నెలకొనడంతో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు బోరు బావి తవ్వకాన్ని ప్రారంభించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు నీటి ఇబ్బంది లేకుండా, కాలనీ వాసులకు నీటి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు.