సత్యసాయి: పుట్టపర్తి మండలం కప్పల బండ గ్రామంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. బుధవారం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ పింఛన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాఘవయ్య నాయుడు అనే దివ్యాంగుడికి జేసీ స్వయంగా రూ.15000 పింఛన్ అందించి ప్రతినెల సక్రమంగా పింఛన్ అందుతోందా అని ఆరా తీశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.