MNCL: ప్రతి ఒక్కరూ డయాబెటిక్ పరీక్షలను తప్పనిసరిగా చేయించుకోవాలని జన్నారం మండల లయన్స్ క్లబ్ సభ్యులు కోరారు. బుధవారం జన్నారం మండలంలోని కలమడుగులో ప్రజలకు మధుమేహ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మధుమేహ వ్యాధితో బాధపడేవారు వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా మందులను వాడాలని సూచించారు.