SKLM: రణస్థలం మండల కేంద్రంలో NTR భరోసా సామాజిక పింఛన్లను పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు బుధవారం పంపిణీ చేశారు. ప్రజలు సంక్షేమం పట్ల ప్రభుత్వం నిరంతరం పథకాలు మంజూరు చేస్తూనే ఉంటారన్నారు. ఒకరోజు ముందు పింఛన్లు పంపిణీ చేయాలన్నది కూటమి ప్రభుత్వం ముందుగానే ఆలోచన చేసిందన్నారు.