AKP: ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డు జంక్షన్లో కొత్త రెవిన్యూ డివిజన్ కార్యాలయంను జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిపాలన సౌలభ్యం కోసం ఈ కొత్త డివిజన్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. డివిజన్ ఏర్పాటుతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.