SKLM: నరసన్నపేట మండలం మాకివలస గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు స్వయంగా ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. పేదల ముఖంలో చిరునవ్వు చూడాలని, వారి ఆర్థిక ఇబ్బందులు గట్టు ఎక్కించాలనే ఉద్దేశంతో సూపర్ సిక్స్ పథకాల అమలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.