GNTR: పేదవాడి ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అన్న క్యాంటీన్లు ఇక పల్లెల్లోనూ ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 3 అన్న క్యాంటీన్లు మంజూరయ్యాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడులో ఒకటి, గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఒకటి, భట్టిప్రోలులో మరొకటి శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి.