MDK: రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో జీవాలకు నటుల మందు పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ ఉపసర్పంచ్ బాబు నాయక్ ప్రారంభించారు. ప్రభుత్వం గొర్రెలు, మేకలు ఆరోగ్యంగా ఉండాలని ఉచితంగా నటుల మందు పంపిణీ చేస్తుందని ఈ అవకాశాన్ని గొర్రెల కాపరులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్త రాజేందర్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.