W.G. యలమంచిలి మండలం, బాడవ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా బాధ్యతలు నిర్వహించిన వెలుగోట్ల జగ్గారావు బుధవారం పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి హాజరై జగ్గారావును ఘనంగా సన్మానించి సత్కరించారు. అలాగే ఉపాధ్యాయునిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు.