వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హాత్వే సీఈవో పదవి నుంచి నేడు వైదొలగనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి తాను బెర్క్‌షైర్ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకుంటానని గతంలో బఫెట్ ప్రకటించారు. ఆయన స్థానంలో గ్రెగొరి ఎబెల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. 95 ఏళ్ల బఫెట్.. 1965లో బెర్క్‌షైర్ పగ్గాలు స్వీకరించారు. 60 ఏళ్లుగా ఆయన ఈ కంపెనీకి సీఈవోగా ఉన్నారు.