నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో షాబునగర్ సమీపంలోని మురుగు కాలువలో ఓ చిన్నారి మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని వ్యక్తులు మృతదేహాన్ని కాలువలో పడేసినట్లు స్థానికులు గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేస్తున్నారు. మానవత్వం నశించడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు