కృష్ణా: నందివాడ మండలం రుద్రపాక గ్రామంలో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ చేశారు. మాజీ మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వంటి పేద వర్గాలకు పెన్షన్లు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని చెప్పారు.