శివాజీ వివాదంలో కొంతమంది తమ వ్యూస్ కోసం ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావును కూడా లాగిన సంగతి తెలిసిందే. దీనిపై గరికపాటి టీం స్పందించింది. ‘ఒక వివాదానికి ఆయన ఎప్పుడో చెప్పిన మాటలను జోడించి, వక్రీకరించి వివిధ యూట్యూబ్ ఛానల్స్ సమస్యను సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి. అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులు, ఛానళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఖాయం’ అని పేర్కొంది.