VSP: ఆనందపురం మండలం గండిగుండంలో పెంటకోట సూరిబాబు (36) అనే కూలీ మంగళవారం మనస్తాపంతో మృతి చెందాడు. భార్య ఇటీవల ప్రమాదానికి గురై పుట్టింటికి వెళ్లడం, తానూ తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ చూసుకునే వారు లేకపోవడం వల్ల ఆవేదనకు లోనయ్యాడని సమాచారం. ఈ ఘటనపై సీఐ వాసు నాయుడు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భీమిలి ఆసుపత్రికి తరలించారు.