MHBD: ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డా.జాటోతు రామచంద్రనాయక్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు తన కుటుంబంతో కలిసి స్వామివారిని దర్శించుకుని, పూజలు చేశారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సంతోషంగా ఉండి, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.